ఎన్జీవో సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా

 కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page 

 హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం నాడు తెలంగాణా స్వచ్ఛంద సంస్థల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆయన నివాస గృహంలో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సేవలందించడంలో స్వచ్ఛంద సంస్థల కృషి ఎంతో అద్భుతం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో స్వచ్ఛంద సంస్థలు ఐక్యంగా ఏర్పడటంఎంతో అభినందనీయం అన్నారు. స్వచ్ఛంద సంస్థలు కరోన లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సేవలు అందించడంలో ఎంతో ముందున్నారని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. స్వచ్ఛంద సంస్థలు కరోనా సమయంలో చేసిన కృషిని ప్రభుత్వమే కాకుండా ప్రజలు కూడా మరువ లేరని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వపరంగా స్వచ్ఛంద సంస్థలకు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలిపారు. తమకు వివరించినది విషయాలన్నింటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణా స్వచ్ఛంద సంస్థల ఐక్య వేదిక అధ్యక్షులు మీనగ గోపి బోయ, చైర్మన్ వుప్పు, సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ పన్యాల మమత గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ దామ రజిని రుద్రమ తదితరులు పాల్గొన్నారు.