నేషనల్ హెల్త్ మిషన్ పిఆర్సి వర్తింపచేయాలి

కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page 

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): నేషనల్ హెల్త్ మిషన్ అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పిఆర్ సి వర్తింపచేయాలని నేషనల్ హెల్త్ మిషన్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు మోహన్ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా నేషనల్ హెల్త్ మిషన్ లో 33 ప్రోగ్రాం లో పని చేస్తున్నారన్నారు. 120 కి పైగా వివిధ హోదాల్లో తెలంగాణలో మొత్తం 14 వేల పైగా ఉద్యోగులు నేషనల్ హెల్త్ మిషన్ పనిచేస్తున్నారు. ఇందులో ఆదిలాబాద్ జిల్లాలో 447 మంది హెల్త్ మిషన్ అవుట్సోర్సింగ్ కాంటాక్ట్ లో ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 11వ పిఆర్సి లో నేషనల్ హెల్త్ మిషన్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పిఆర్సి ప్రకటించకపోవడం బాధాకరమైన విషయం అన్నారు .నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం చెల్లించాలి. కానీ దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పునిచ్చింది అన్నారు. కానీ ఈ తీర్పు అమలు అవుతున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అమలు కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గత రెండేళ్లుగా గజగజలాడుతున్న కోవిడ్  రోగులకు కూడా ఎన్నో సేవలందించిన నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టడం అన్యాయమన్నారు. ప్రాణాలకు తెగించి కుటుంబాలకు దూరంగా ఉంటూ ఎంతో కష్టాలు పడుతూ సేవలు అందించిన ఘనత ఉద్యోగులు వైద్య ఉద్యోగుల దేనని ఈ సందర్భంగా వారు తెలిపారు.ఈ కార్యకమంలో ఈ దత్తు,చేతన్,గోపాల్, జక్కి నవీన్, ఉమాకాంత్, రాజ్ కుమార్,మల్లన్న తదితరులు పాల్గొన్నారు.