కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 984802545
కావలి ,(ఆరోగ్యజ్యోతి):పట్టణంలో ఉదయగిరి రోడ్ ఇండియన్ బ్యాంక్ దగ్గర రామగిరి సత్యం చాలివేంద్రం ఆవరణంలో రామగిరి సత్యం కుమారుడు రామగిరి అనుదీప్ పుట్టిన రోజు సందర్భంగా కావలి టు టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ టి.అరుణకుమారి చేతులమీదుగా పేద ప్రజలకు అన్నదానం చేయటం జరిగింది, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మా పోలీసు డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తూ ఇటీవల కాలంలో సత్యం మరణించడం జరిగింది ఆయన తనయుడు రామగిరి అనుదీప్ తన పుట్టినరోజు సందర్భంగా పేద ప్రజలకు ఒక్క పూటైనా అన్నం దానం చెయ్యాలని మంచి ఆలోచనతో ఈ రోజు అన్నదానం చేయటం అభినందించారు అతను కూడా తన తండ్రి చేసిన సేవను కొనసాగించాలని ఆమె అన్నారు. స్వచ్చంద సేవా సంస్థల ఐక్యవేదిక అధ్యక్షులు డాక్టర్ చేవూరుచిన్న మాట్లాడుతూ కరోనా మహమ్మారి వలన పేద ప్రజలు పనులు లేక ఆకలితో అలమటిస్తున్నారని వారికి అన్నదానం చేయటం సంతోషమని తన తండ్రి బాటలో తనయుడు నడవాలని పేద ప్రజలకు సహాయం చేసే మనస్సు ఉండాలని ఆయన అన్నారు, పై కార్యక్రమంలో హేపీ స్వచ్చంద సంస్థ నిర్వహుకులు ఘనిభాషా, సంస్థ ఉపాధ్యక్షుడు విజయ్ దేవరకొండ, అంచిపాక హాజరత్,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.