కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page
తెలంగాణ మెడికల్ &హెల్త్
ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర
ఆసోసియేట్ అధ్యక్షలు బి .అరుణ
వరంగల్,(ఆరోగ్యజ్యోతి):
కరోనా కాలంలో పీవర్ సర్వే
చేసిన వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు ఎఎన్ఎంలను ,ఆశాలను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వరంగల్ వేదికగా ప్రశసించారు. చేతులు
జోడిస్తున్నాను అన్న మాట వైద్య
ఆరోగ్య శాఖ ఉద్యోగులకు సంతోషంను
కల్గించింది .కరోనా కాలంలో
కుటుంబానికి దూరంగా ఉంటూ
కరోనా నిర్దారణ పరీక్షలు ,అలాగే టీకాలు
ఇవ్వడం లో పడ్డ కష్టమును
గుర్తించిన ముఖ్యమంత్రికి తెలంగాణ మెడికల్ &హెల్త్
ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర
ఆసోసియేట్ అధ్యక్షలు బి .అరుణ ధన్యవాదములు తెలిపినారు.ఈ పోరాటంలో ఎంతో
మంది అరోగ్య శాఖ ఉద్యోగులు మరణం పొందారని ,ఇంతటి త్యాగంను ముఖ్యమంత్రి కెసిఆర్
గుర్తించడం పట్ల ఆమె హర్షం
వ్వక్తం చేసినారు.మా కృషి ని
గుర్తించిన మీరు మేము
అనుభవిస్తున్నా కష్టం బాధను ,సమస్యల ను మీ దృష్టికి
తీసుకువస్తున్నాం ,దయచేసి పరిష్కరించండని ఆమె పత్ర్కముఖంగా ముఖ్యమంత్రిని
కోరినారు.
- Ø వైద్య ఆరోగ్య శాఖలో ఎఎన్ఎంలు 30 సంవత్సరాలు ఒకే కేటగిరి లో పనిచేస్తున్న తమకు పదోన్నతులు లేక రిటైర్డ్ అవుతున్నామని వెంటనే తమరు ఒకసారి ఆలోచించి పదోన్నతులు కల్పించి ఉంచాలని ఆమె కోరారు. పదోన్నతులు కల్పించడం వల్ల చాలామంది ఏఎన్ఎం ట్రైనింగ్ చేసిన వారు ఉన్నారని వీరిని వీధుల్లో తీసుకోవాలని ఆమె కోరారు.
- Ø నేషనల్ హెల్త్ మిషన్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పద్ధతిలో సెకండ్ ఎఎన్ఎంలు గత 12 సంవత్సరాలుగా పని చేస్తున్నారని 21 వేల జీతంతో పని చేస్తున్న, వారికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతోపాటు రెగ్యులర్ ఉద్యోగాలు ఇవ్వాలి
- Ø నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్ లో పనిచేస్తున్న సెకండ్ ఏ ఎం ఎం లు, ల్యాబ్ అసిస్టెంట్లు, హెల్త్ అసిస్టెంట్లు ,ఫార్మసిస్ట్ గత పది సంవత్సరాలకు పైగా కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారని వారందరినీ ప్రభుత్వం పిఆర్సి పెంచడంతోపాటు రెగ్యులర్ ఉద్యోగులు గుర్తించాలని ముఖ్యమంత్రిని కోరారు