రోడ్డు ప్రమాదంలో సెకండ్ ఏఎన్ఎం మృతి తీరని లోటు

ఆదిలాబాద్ (ఆరోగ్యజ్యోతి):ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సెకండ్ ఏఎన్ఎం  గా విధులు నిర్వహిస్తున్న సునీత మంగళవారం రోజు ఉదయం విధినిర్వహణలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది .ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వైద్య ఆరోగ్య సంఘం ఐక్యవేదిక అధ్యక్షులు డాక్టర్ శ్రీధర్ మెట్పల్లి ,కన్వీనర్ భండారి కృష్ణ ,కన్వీనర్ డాక్టర్ శ్రీకాంత్ డాక్టర్ నవ్య సుధా,సిడం వామన్,  వెంకట రమణ ,నవీన్ తెలిపారు. మృతి చెందిన మృతురాలి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం తో పాటు ప్రభుత్వం తరఫున 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు .