వరంగల్ అర్బన్,(ఆరోగ్యజ్యోతి): పుప్పాలగుట్ట
పట్టణ ఆరోగ్య కేంద్రం ముందు నల్ల బ్యాడ్జిలతో సిబ్బంది మెడికల్ ఆఫీసర్ డాక్టర్
ఎస్. రవీందర్ అద్వర్యంలో నిరసన
కార్యక్రమాన్ని చేపట్టారు. అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బందితో పాటు , కాంట్రాక్ట్ , ఔట్
సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు
జీవో 60 సవరించి సుప్రీంకోర్టు ఇచ్చిన
తీర్పు ప్రకారం 'సమాన
పనికి సమాన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేసారు. యూ.పీ.హెచ్.సి చింతల్ హాస్పిటల్
నందు బోజన విరామ సమయం లో నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ
కార్యక్రమంలో డాక్టర్ కే. శ్రీ దేవి ఈ స్టాఫ్ నర్స్ రుబీన ,ఎ.ఎన్.ఎమ్.లు .ఉప్పలమ్మ
, శ్రీలత , ఉమా , మెడికల్
అసిస్టెంట్ రామా రాజేష్ ఖన్నా , స్టాఫ్
నర్స్ సాయి వీణ , ఫార్మసీ
జ్యోష్న , సి. ఓ. డీ. మోహన్ రావు తదితరులు
పాల్గొన్నారు.