పిఆర్సి కి 528మంది వైద్యులు దూరం

     కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

నియామకాల ఆలస్యం తోనే పిఆర్సి కి దూరమా

హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సి జీవోలు విడుదల చేసిన అనంతరం కొందరికి లాభం జరిగినప్పటికీ మరికొందరికీ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఇక వైద్యఆరోగ్యశాఖ విషయానికి వస్తే ఆ శాఖలో పనిచేస్తున్న నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ఎహ్ఎం) ఉద్యోగులకు పిఆర్సి ప్రకటించలేదు ప్రభుత్వం. ఇది ఇలా ఉంటే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో పనిచేస్తున్న 528 మంది వైద్యులకు పిఆర్సి ప్రయోజనాలు అందలేదు. వైద్య అధికారుల నియామకాలు ఆలస్యంగా జరగడం వల్లనే పిఆర్సి అందలేదని పలువురు అంటున్నారు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో వైద్యుల పోస్టులకు 2017 నవంబర్ లో నోటిఫికేషన్ విడుదల చేసింది. 2018 మార్చి నాటికి ఎంపికైన వైద్యులు విధుల్లో చేరాలి. కానీ కొందరు అభ్యర్థులు వెయిటేజీ మార్కులు కొరకు కోర్టును ఆశ్రయించారు. దీంతో నియామకాలు ఆలస్యమయ్యాయి. అయితే పిఆర్సి నిబంధనల ప్రకారం 2018 జూన్ నాటికి నియమితులైన వారికే 30 శాతం పిఆర్సి వర్తిస్తుంది. ఒక నెల ఆలస్యం కావడంతో డి హెచ్ పరిధిలో పనిచేస్తున్న 528 మంది వైద్యులకు పిఆర్సి వర్తిచడం లేదు.