కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి):నేషనల్
హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నలుగురు కమ్యూనిటీ
ఆర్గనైజేషన్ నియమించినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాథోడ్
తెలిపారు. సోమవారం రోజు తన చాంబర్లో ఎంపికైన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ లకు నియామక
పత్రాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూ.గో జిల్లా లోని
ఇంద్రవెల్లి మండలం ధనోర లో, ఇచ్చోడ మండలంలోని, గర్జం, తలమద్రిలో అలాగే బజార్హత్నూర్ లలో కమ్యూనిటీ హెల్త్ ఆర్గనైజర్ లను నియమించడం
జరిగిందని ఆయన తెలిపారు. నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో ఈ పోస్టులకు ఎంపిక చేయడం
జరిగిందని నేటి నుండి వారు వీధుల్లో హాజరవుతారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు .ఈ
కార్యక్రమంలో జిల్లా సర్వైలెన్స్ అధికారి డాక్టర్ వై సీ శ్రీనివాస్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ విజయ
సారథి తదితరులు పాల్గొన్నారు.