రైతు పథకాలను సద్వినియోగం చేసుకోవాలి - DCMS వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు

 

భద్రాది కొత్తగూడెం,(ఆరోగ్యజ్యోతి): తెలంగాణా రాష్ట్రంలోని కె.సి.ఆర్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చేపడుతున్న రైతు పథకాలను సద్వినియోగం చేసుకోవాలని DCMS వైస్ చైర్మన్ పాల్వంచ కో ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. సొసైటీ కార్యాలయంలో గురువారం కొత్వాల రైతులకు జీలుగు విత్తనాలను రాయితీపై పంపిణీ చేశారు. ఈ సందర్బంగా కొత్వాల మాట్లాడుతూ మాగాణి భూముల్లో పచ్చి రొట్ట పైర్లను సాగుచేసి, బలానికి ఉపయోగిస్తే మంచి దిగుబడులు వస్తాయన్నారు. జిలుగులు 30 కిలోల బస్తా ధర 1605 రూ"లు ఉండగా 1043 రూ"ల రాయితీ పోను 561.60 రూ"లు ఉందన్నారు. జిలుగులు 18 టన్నులు, 600 బస్తాలు పంపిణీ చేయనున్నామన్నారు. వరి BPT 5204 సాంబమసూర విత్తనాలు  10 టన్నులు 25 కిలోల బస్తాలు 400, ఒక బస్తా రూ.852 రూ"లకు DAP 20 టన్నులు 400 బస్తాలు, 50కిలోల బస్తా 1200 రూ"లకు యూరియా 140 టన్నులు 3115 బస్తాలు, 45 కిలోల బస్తా 266.50 రూ"లకు ప్రభుత్వం MRP ధరలకే పంపిణీ చేయనున్నామన్నారు. రైతులు తమ పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ వ్యవసాయశాఖ అధికారులకు ఇచ్చి, కూపన్ తీసుకుని, సొసైటీ సిబ్బంది ద్వారా విత్తనాలు, ఎరువులు తీసుకోవచ్చన్నారు. రైతులు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ, తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్నారు. సొసైటీ ద్వారా అందించే ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్, వ్యవసాయశాఖాధికారి శంభో శంకర్, అసిస్టెంట్ రిజిస్టార్ జి.ప్రియాంక, సొసైటీ డైరెక్టర్లు కనగాల నారాయణ, జరబన సీతారాంబాబు, చౌగాని పాపారావు, మేకా త్యాగరాజు, భూక్యా కిషన్, సొసైటీ గోడౌన్ ఇంచార్జి సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.