ఆక్సిజన్ కాంసెంట్రేటర్, N95 మాస్కులు, పిపిఈ కిట్లును పంపిణీ

  కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page 

గాంధీ మెడికల్ కళాశాల కు చెందిన పూర్వ విద్యార్థుల సహాయం

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి):కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ.. వేలకొద్ది ప్రాణాలు నిమిషాలలో గాలిలో కలిసిపోతున్నాయి. ఒక గ్రామమే కాకుండా దేశమే కాకుండా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాతో  ఎందరో మంది బలైపోయారు .గత 2 ఏళ్లుగా దేశ విదేశాల నుండి దాతలు తోడుగా నిలుస్తున్నారు. అయీన ప్పటికీ ఏం చేయలేని పరిస్థితి ఉంది .కొందరు నిత్యవసర వస్తువులు, మరికొందరు కిట్లు  ఇలా రకరకాల సహాయ సహకారాలు అందిస్తున్నాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి ఈ సమయంలో వారికి తోచిన సహాయం అందించారు .ఇదిలా ఉంటే గాంధీ మెడికల్ కళాశాల 2000 సంవత్సరం బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులువి దేశాల్లు  ఉంటున్నారు.ఆదిలాబాద్ గిరిజన జిల్లా కావడంతో సహాయ సహకారాలు అందించాలని ఉద్దేశంతో నుంచి 7 ఆక్సిజన్ కాంసెంట్రేటర్, N95 మాస్కులు, పిపిఈ కిట్లు ఆదిలాబాద్ జిల్లా జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ విజయసారథి పూర్వ విద్యార్థుల ద్వారా పంపించారు. గురువారం రోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ కు అందజేశారు. అందులో ఉన్న వస్తువులను వైద్యులకు ఇవ్వటం ఎంతో సంతోషకరమైన విషయమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ నరేంద్రనాథ్ అన్నారు. వైద్యులను దృష్టిలో ఉంచుకొని కిట్ పంపిణీ చేయడం ఎంతో సంతోషం అని తెలిపారు .స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రతి ఒక్కరు సేవ అందించడం కోసం ముందుకు రావాలని అయన సూచించారు. అనంతరం జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి మాట్లాడుతూ 2000 సంవత్సరం గాంధీ మెడికల్ కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థులు విదేశాల్లో చాలామంది ఉన్నారని ఆదిలాబాద్ జిల్లాకు ఏదైనా సహాయం కింద అందించాలనే ఉద్దేశంతో నుంచి 7 ఆక్సిజన్ కాంసెంట్రేటర్, N95 మాస్కులు, పిపిఈ కిట్లు ను పంపిణీ చేశారన్నారు.ఒకటి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిఅందించమని, మిగితా 7 కిట్ లను స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసే వారికి ఇవ్వడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ,డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ సాధన, జిల్లా సర్విలేన్స్ అధికారి డాక్టర్ వై సి శ్రీనివాస్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ విజయ సారథి, అడిషనల్ డి ఎం అండ్ హెచ్ వో జిల్లా లెప్రసీ మరియు ఎయిడ్స్ నివారణ అధికారి డాక్టర్ శ్రీకాంత్ జిల్లా మలేరియా నివారణాధికారి డాక్టర్ శ్రీధర్ మెట్పల్లి వార్క్షయ నివారణ అధికారి డాక్టర్ ఈశ్వర్ రాజ్ఎన్ సి డి అధికారి డాక్టర్ క్రాంతిఎంపిహెచ్ ప్రోగ్రాం అధికారిని డాక్టర్ నవ్య సుధ   వైద్య అధికారులు తదితరులు  పాల్గొన్నారు.