కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 70 13 26 01 76 )
www .arogyajyothi.com, arogyajyothi.page
సిద్దిపేట,(ఆరోగ్యజ్యోతి):కరోనా కష్టకాలంలో ఫ్రంట్ లైన్ వారియర్ గా పని చేస్తూ సర్వీసులు అందించిన వైద్య ఆరోగ్య శాఖ లోని 104 ఉద్యోగులకు గత ఆరు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తమకి పెండింగులో ఉన్న వేతనాలు చెల్లించాలని కోరుతూ బుధవారం సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కి వినతి పత్రం అందించారు.. ఈ సందర్భంగా 104 ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రచ్చ రవీందర్, జిల్లా అధ్యక్షులు గొల్ల రాజేశ్వర్ ,కార్యదర్శి సంతోష్ రెడ్డి లు మాట్లాడుతూ 104 ఉద్యోగులకు సరిపోయే బడ్జెట్లు ఉన్నప్పటికీ వేతనాలు చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. కరోనా కష్టకాలంలో కరోనతో పోరాటం చేస్తూ ముందువరుసలో ఉండి ప్రజలకు ఎంతో సేవలు అందించినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి ఇన్సెంటివ్ ఎప్పటి వరకు అందించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్సెంటివ్ మాట దేవుడెరుగు కానీ ప్రతి నెల జీతం కూడా రాక పోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని వారు తెలిపారు. 104 ఉద్యోగుల వేతనాల విషయమై అనేక మార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుక వెళ్ళిన ప్రయోజనం లేకుండా పోయిందని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి బకాయి వేతనాలు వెంటనే విడుదల చేయడంతో పాటు ప్రతి నెల 5వ తేదీ లోపు జీతాలు చెల్లించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో లో టిఆర్ఎస్ కెవి రాష్ట్ర కార్యదర్శి మంచే నర్సింలు, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.