కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page
జిల్లా
కలెక్టర్ వినతి పత్రం
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): రాజీవ్ గాంధీ
ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రిలో 157 మంది
స్టాఫ్ నర్స్ ల ను అధికారులు తొలగించారు. కరోన కష్టకాలంలో వీరి సేవలను ప్రభుత్వం వినియోగించుకుంది. కరోన ఉదృతి
కొనసాగుతున్న తరుణంలో 2020 ఏప్రిల్ రాష్ట్రవ్యాప్తంగా 1640 మంది స్టాఫ్ నర్సు లను ప్రభుత్వ
ఆసుపత్రుల్లో రోగులకు సేవలు అందించాలని అవుట్సోర్సింగ్ తీసుకొన్నారు. దీనిలో
భాగంగానే ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలకి 157 మంది స్టాఫ్ నర్సులను విధుల్లోకి
తీసుకున్నారు. రిమ్స్ ఆసుపత్రిలో పని
చేస్తున్న 157 మంది స్టాఫ్
నర్సులను విధుల్లో నుంచి గురువారం నాడు తొలగించారు. వైద్య కళాశాలలకు అనుబంధంగా
ఉన్న ఆసుపత్రులు వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఇటీవల
టీఎస్పీఎస్సీ ద్వారా నియామకమైన శాశ్విత స్టాఫ్ నర్సులు రానున్న నేపథ్యంలో కోవిడ్
కొరకు నియమించబడిన ఔట్సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు తొలగిస్తూ
ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న
157 మంది స్టాఫ్
నర్సులు, అవుట్ సోర్స్ నర్సింగ్ ఆఫీసర్స్
అసోసియేషన్ అద్వర్యంలో జిల్లా కలెక్టర్ కు
గురువారంనాడు మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా స్టాప్ నర్సులు మాట్లాడుతూ కరోన సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన తమకు
ప్రభుత్వం ఎలాంటి నోటీసులు కానీ ముందస్తు సమాచారం ఇవ్వకుండా తొలగించారని ఆవేదన
వ్యక్తం చేశారు.చాలీచాలని వేతనంతో పని చేశామని కరోనా సమయంలో ఆరు గంటల పాటు కనీసం
మంచి నీళ్ళు కూడా తాగకుండా రోగులకు సేవలు అందించడంలో ముందుంది అన్నారు. కరోన సోకిన రోగికి బంధువులే రక్తసంబంధీకులు కూడా
దగ్గరకు రాలేదని అలాంటి వారికి సేవలు మేము అందించామని తెలిపారు. ప్రభుత్వం స్టాఫ్
నర్సులు ను తొలగించకుండా విధులను తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో
రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కి అనుబంధంగా ఉన్న సూపర్
స్పెషాలిటీ ఆస్పత్రిలో అందరికీ అవకాశం కల్పించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్
చేశారు. ముఖ్యమంత్రి రాష్ట్రవ్యాప్తంగా కరోన సమయంలో తీసుకున్న స్టాఫ్ నర్సులు
అందర్నీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వారు కోరారు .కార్యక్రమంలో అవుట్
సోర్స్ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్
ప్రసిడెంట్ అసిపోద్దిన్, వైసే ప్రసిడెంట్లు
వెంకటేష్,పి. స్వప్న వర్కింగ్ ప్రసిడెంట్
వైశాలి, ట్రెజరర్ తాయమ్మ, వర్కింగ్ ప్రెసిడెంట్ వైశాలి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్. అశ్విని,తయమ్మ,
కదిర్ తదితరులు పాల్గొన్నారు.