ఏఎన్ఎం సర్టిఫికెట్ అప్ డేట్ తేదీ 24 వరకు పొడగింపు

 కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page ..arogyajyothi news (Youtub)


హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి):  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఏఎన్ఎం రిక్రూట్మెంట్ కు సంబంధించిన సర్వీస్ సర్టిఫికెట్ అప్డేట్ లో ఇబ్బందులు ఎదురు అయినందున సర్టిఫికెట్ అప్ డేట్ కొరకు జూలై 24 వరకు టి ఎస్ పి ఎస్ సి పొడిగించింది. ఏఎన్ఎం రిక్రూట్మెంట్ కు సంబంధించిన వారు సర్వీస్ సర్టిఫికెట్ అప్డేట్ చేసేవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.

ఓపెన్ కానీ వెబ్సైట్

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఏఎన్ఎం సర్వీస్ సర్టిఫికెట్ అప్డేట్ కు సంబంధించిన సైట్ ఓపెన్ కావడం లేదు. నాలుగు రోజుల్లో నుండి ఏఎన్ఎంలు సైట్ ఓపెన్ కాక అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఓపెన్ అయినప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో ఓపెన్ కావడం లేదు. ఇదిలా ఉంటే సర్వీస్ సర్టిఫికెట్ అప్డేట్ ఎవరు చేయాలని అన్న విషయం ఇంకా ఆరోగ్య కార్యకర్తలకు అర్థం కావడం లేదు. స్పష్టమైన జవాబు దొరకక కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలామంది ఏఎన్ఎంలు. సర్వీస్ సర్టిఫికెట్ ప్రొఫార్మా కార్యాలయంలో తీసుకుంటున్నప్పటికీ ఎవరు సర్వీస్ సర్టిఫికెట్ అప్డేట్ చేయాలి అనే విషయం అడిగినా కార్యాలయాల సిబ్బంది కూడా సమాధానం దొరకడం లేదు .ఏం చేయాలో చివరకు అర్థం కాక ప్రతి ఒక్కరు సర్వీస్ సర్టిఫికెట్ అప్డేట్ కోసం వెళ్తున్నట్టు తెలుస్తుంది.