కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page
అమరావతి,(ఆరోగ్యజ్యోతి) : ఎపిలో గడచిన 24 గంటల్లో 93,759 మంది నమూనాలు పరీక్షించగా.. 3,464 కొత్త కేసులు నమోదయ్యాయి. 35 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 4,284 మంది కోలుకున్నారు. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ వివరాలు వెల్లడించింది. కరోనా వల్ల చిత్తూరు జిల్లాలో ఐదుగురు, ప్రకాశంలో ఐదుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, గుంటూరులో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, విజయనగరంలో ఇద్దరు, కడప, కర్నూలు, పశ్చిమగోదావరిలో ఒక్కరు చొప్పున మరణించారు. ఇప్పటి వరకు 18,96,818 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 18,46,716 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 37,323 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనాతో 12,779 మంది మృతిచెందారు.