ఎం హెచ్ ఎం స్టాఫ్ నర్స్ ల జాబితా విడుదల

 

ఎం హెచ్ ఎం స్టాఫ్ నర్స్ ల జాబితా విడుదల

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి):జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఆరోగ్య మిషన్ పథకంలో అసంక్రమిత వ్యాధుల నివారణ ,మానసిక వ్యాధుల చికిత్స కార్యక్రమం లో సేవలందించేందుకు సైక్రియాటిస్ట్, స్టాఫ్ నర్స్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చామణి  దీనికి సంబంధించిన వాటిలో స్టాఫ్ నర్సు పోస్టులకు సంబంధించిన తుది జాబితాను విడుదల చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్  నరేందర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు .స్టాఫ్ నర్స్ పోస్టులు 1:5 నిష్పత్తి ప్రకారం ఈ నెల 8న ఇంటర్వ్యూలు డిఎంఅండ్హెచ్ఓ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెబ్సైట్లో పెట్టడం  జరిగిందని తెలిపారు

5న వాక్ ఇన్ ఇంటర్వ్యూ                                                                            

ఈ నెల 5న ఉదయం 11 గంటలకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ఎం హెచ్ ఎం పరిధిలో గల వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. పీడియాట్రీషియన్ -2, గైనకాలజిస్ట్ -1, అనస్థీషియా-1, సైకియాట్రిస్ట్-1, మెడికల్ ఆఫీసర్ 7 పోస్టులకు గాను అర్హులైన అభ్యర్థులు జులై 5న నిర్వహించి ఇంటర్వ్యూ హాజరుకావాలని ఆయన పేర్కొన్నారు హాజరయ్యే అభ్యర్థులు సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు.

5న సి హెచ్ ఓ పోస్టుల కౌన్సిలింగ్

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ లోని సబ్ సెంటర్ లో ఆఫీసర్ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా మూడో జాబితా లో ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 5న ఉదయం 11 గంటలకు కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు డాక్టర్ నరేందర్ ఒక ప్రకటనలో తెలిపారు .ఎంపికైన అభ్యర్థుల జాబితా వివరాలు వెబ్సైట్లో పొందవచ్చని ఆయన తెలిపారు.