హైదరాబాద్ (ఆరోగ్య జ్యోతి): సిఐటియు ఆధ్వర్యంలో నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పీఆర్సీని నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులకు అందించలేదని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గత పది పదిహేను సంవత్సరాల నుండి ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలీ చాలని వేతనాలతో అష్టకష్టాలు పడుతూ జీవనం కొనసాగిస్తున్నారని వెంటనే పిఆర్సి వర్తింపజేయాలని కోరారు.