స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం : జిల్లా కలెక్టర్

      కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page ..arogyajyothi news (Youtub)

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): జిల్లాలో కరోనా కట్టడి కోసం పలు స్వచ్ఛంద సంస్థలు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూన్నారాని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ కు అన్నారు.ఇందులో భాగంగానే మహిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కరోనా కట్టడికి కృషి చేస్తున్న వైద్య సిబ్బందికి సంబంధించిన సామగ్రిని కలెక్టర్  కి అందజేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పి.పి.ఈ కిట్స్, శానిటైజర్, పల్సర్ ఆక్సీమీటర్, బెడ్ షీట్స్, ఏన్ 95 మాస్క్, సర్జికల్ మాస్క్, గ్లౌజ్ తదితర సామాగ్రిని సంస్థ సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా ఆపత్కాలంలో పలు స్వచ్ఛంద సంస్థలు సామాజిక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. పెద్ద మొత్తంలో వైద్య సిబ్బందికి అవసరమయ్యే సామాగ్రిని అందించిన మహిత సంస్థ సభ్యులను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ విజయ సారథి, మహిత స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ రమేష్ శేఖర్ రెడ్డికోఆర్డినేటర్ శ్రీకాంత్, సారంగాపూర్ జడ్పిటిసి  రాజేశ్వర్ రెడ్డి, బోర్డు సభ్యులు శ్రీకాంత్ రెడ్డిసిబ్బంది ప్రమోద్, కిషోర్,స్రవంతి తదితరులు పాల్గొన్నారు.