ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తప్పకుండా తీసుకోవాలని జిల్లా ఎయిడ్స్ మరియు లెప్రసీ అధికారి అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీకాంత్, ఎన్ సిడి అధికారి డాక్టర్ క్రాంతిలు అన్నారు. గురువారం నాడు ఎన్నారై టికా కేంద్రాన్ని వారు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విడతలవారీగా అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. 18 సంవత్సరాల పైన ఉన్న వారందరికీ వ్యాక్సిన్ ప్రారంభమైందని ప్రతి ఒక్కరు తీసుకోవాలని వారు సూచించారు. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎలాంటి చెడు పరిణామాలు ఎదురుకాని తెలిపారు. వారి వెంట హెల్త్ ఎడ్యుకేషన్ అధికారి ఆనంద్ రావు, బండారి కృష్ణ తదితరులు ఉన్నారు.