ఎస్సి రిజర్వేషన్ మా జన్మ హక్కు

   కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page ..arogyajyothi news (Youtub)

 రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోపి రజక

 కోదాడ,(ఆరోగ్యజ్యోతి) : రజక రిజర్వేషన్ సమితి జిల్లా కమిటీ సమావేశం కోదాడ లో జరిగింది.  జిల్లా అధ్యక్షుడు గూడెపు నాగలింగం అధ్యక్షత న జరిగిన  ఈ సమావేశానికి రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సర్ధార్ గోపి రజక ముఖ్య అతిధి గా హాజరు అయ్యారు. ఈ సందర్భంగా గోపి రజక మాట్లాడుతూ దేశంలో 17 రాష్టాల్లో రజకులు షెడ్యూల్డ్ క్యాస్ట్ లో ఉండి రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తున్నారు అని అంటారని పనులు చేసే రజకులుకి కూడా షెడ్యూల్డ్ క్యాస్డ్త్ రిజర్వేషన్ ఇవ్వాలని అది రజకుల జన్మ హక్కు అని అన్నారు. ఈ కార్యక్రమంలో రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆతుకూరి సంజీవ్ రాజ్,  జిల్లా కార్యదర్శి రేగాళ్ల శ్రీను,  హుజర్నగర్ నియోజకవర్గ అధ్యక్షుడు ఉళ్లేందుల వెంకటేశ్వర్లు, కర్కయల గూడెం గ్రామ అధ్యక్షుడు పిల్లుట్ల మధు , గూడెపు బ్రహ్మం కందగట్ల సైదులు ,గోపీనాథ్ పాల్గొన్నారు.