కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): రిమ్స్ లో కార్మికులు,ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పైన,శుక్రవారం తెలంగాణ యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు ) అధ్వర్యంలో లో రిమ్స్ ఎదుట ధర్నా చేయటం జరిగింది. ఈ సందర్భామగా జిల్లా ప్రధనకార్యదర్శి నవీన్ కుమార్ మాట్లాడుతూ ఈపీఎఫ్ లు 39నెలల నుండి ఉద్యోగుల ఖాతాలో జమచేయకుండ అవకతవకలకు పాల్పడిన స్పార్క్ ఏజెన్సీ నీ రద్దు చేయాలని అన్నారు.ఏజెన్సీ కాలపరిమితి ముగిసిన కూడా కొనసాగించడంలో అధికారుల నిర్లక్షం వైఖరి ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేయటం జరిగిందని ఈ సందర్భంగా అయన పేర్కొన్నారు. 11వ PRC లో కనీస వేతనం అమలు చేయాలని అయన డిమాండ్ చేసినారు.పనిష్మెంట్ ల పేరుతో రోజుల తరబడి ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్న వారి పైన చర్య తీసుకోవాలనని అన్నారు.