కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page ..arogyajyothi news (Youtub)
- మానవ హక్కుల కమిషన్ చైర్మన్ కి వినతి పత్రం
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): జాతీయ ఆరోగ్య మిషన్ తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల
సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నేషనల్ హెల్త్ మిషన్ కాంట్రాక్ట్
ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు మోహన్ నాయక్
ఆధ్వర్యంలో మానవ హక్కుల కమిషన్ చైర్మన్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ
వినతిపత్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రోగ్రాంలలో 27 పైగా వివిధ
హోదాల్లో 15 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. కానీ రాష్ట్ర
ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పిఆర్సి ఉద్యోగులకు ఇవ్వలేదని తెలిపారు. రాజ్యాంగం
ఆర్టికల్ 141 ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సూచించింది అన్నారు. 2016 జనవరి 16 వ తేదీన కేంద్ర ప్రభుత్వం గెజిట్ నెంబర్ 73 ద్వారా వేతనాలు
పెంచిన అన్నారు .కానీ ఆ వేతనాలు అందడం లేదని పేర్కొన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ లో
పనిచేస్తున్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు సమకూరుస్తుందని రాష్ట్ర
ప్రభుత్వం 40 శాతం నిధులు జోడించి నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు
చెల్లించవలసి ఉంటుంది అన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సిన 40 శాతం వాటా
నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందని వినతి పత్రంలో పేర్కొన్నారు.ప్రభుత్వం
వెంటనే స్పందించి పిఆర్సి పెంచడంతోపాటు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని నేషనల్
హెల్త్ మిషన్లో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ఆయన రాష్ట్ర మానవ
హక్కుల కమిషన్ చైర్మన్ ను కోరారు.వినతి పత్రం కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి దొంతుల ప్రవీణ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.