వరుస వివాదాల్లో రిమ్స్‌ డైరెక్టర్లు... ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని రీమ్స్....

కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page

  • డైరెక్టర్లు  మారినా తీరు మారని రిమ్స్....
  • 2015 నుంచి నలుగురు డైరెక్టర్లు... 2019 కి ముందే అబివృద్ది.....
  • జోడి పదవులతో ముందుకు సాగని వైనం.....
  • కొత్త సూపరిండెంట్ ఎవరు.....

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): ఆదిలాబాద్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వివాద ల కేంద్రంగా మారింది. ఇప్పటివరకు డైరెక్టర్ ల పై వరుస వివాదాలు రావడం తో తొలగించారు.. అప్పటి నుంచి ఎప్పటి వరకు వివాదాల మధ్యనే రిమ్స్ నడుస్తుంది. రిమ్స్ అభివృద్ధికి నోచుకోక పోవడానికి కారణాలు అనేకం ఉన్నప్పటికీ సరైన డైరెక్టర్ లేక ఒకవేళ డైరెక్టర్లు ఉన్న వివాదాలకు దారి తీయడంతో అభివృద్ధి కనిపించడం లేదు. మూడేళ్ల సమయం లో ముగ్గురు డైరెక్టర్లు మారాలంటే ఆరోపణలు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతుంది ఇదే క్రమంలో చూసినట్లయితే డైరెక్టర్ తో పాటు సూపరిండెంట్ కూడా ఒక్కరే ఉండటం వల్ల అనేక రకాల సమస్యలు తలెత్తుతున్నాయి.2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు ముగ్గురు  డైరెక్టర్లు మారారు . కానీ అభివృద్ధి మాత్రం శూన్యం కనిపిస్తుంది ..రోగులకు సరైన వైద్య సౌకర్యాలు లేక ఉన్న వైద్యులు వైద్య సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించకపోవడం ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. 2019 సంవత్సరానికి ముందు రిమ్స్ డైరెక్టర్ మరియు ఆసుపత్రి సూపరిండెంట్ గా ఉన్నడాక్టర్ అశోక్  సమయంలో ఎంతోకొంత అభివృద్ధి జరిగింది. ప్రస్తుతం ఈయన తర్వాత ముగ్గురు డైరెక్టర్లు ఉన్నప్పటికీ నామమాత్రంగానే అభివృద్ధి జరిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇటీవల తొలగించబడిన డైరెక్టర్  డాక్టర్  భానోత్ బలరాం బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వివాదం గానే మారినప్పటికీ వైద్యుల నియామకాల విషయంలో మాత్రం ముందడుగు వేశారు. గతంలో ఖాళీగా ఉన్న పోస్టులను బలరాం బాధ్యతలు చేపట్టిన తర్వాత పూర్తిస్థాయిలో భర్తీ చేశారు. అలాగే ఆసుపత్రి కళాశాల పిజి  సీట్లు కొరకు ఆయన ఎంతగానో కృషి చేశారు. ఆయన కృషి ఫలితంగానే ఇటీవల మూడు  డిపార్ట్మెంట్ లకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇటీవల రిమ్స్ ను  పర్యవేక్షించింది. ఆసుపత్రి సూపరిండెంట్ గా మరియు రిమ్స్ డైరెక్టర్ గా ఒక్కరు బాధ్యతలు ఉండటం వల్ల ఇటు కళాశాల అటు  ఆస్పత్రికి న్యాయం చేయలేక పోతున్నారు. జోడు పడకుండా వల్ల కూడా అడ్మినిస్ట్రేషన్ మాత్రమే చూడడానికి వీలు అవుతుంది ఒక డైరెక్టర్ మరొకరు సూపర్ గా ఉన్నట్లయితే అటు  ఆసుపత్రికి, కళాశాలకు న్యాయం జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. కానీ మనకు వచ్చిన డైరెక్టర్లు అందరూ జోడి పాటలతోనే మాత్రం కొనసాగిస్తున్నారు .ఇది ఏంటి అని అడిగేవారు కూడా కరువయ్యారు. ఇదిలా ఉందగా డాక్టర్ అశోక్ రిమ్స్ డైరెక్టర్ మరియు ఆసుపత్రి సూపరిండెంట్ గా ఉన్న సమయంలో ఆస్పత్రికి కళాశాలకు కొద్దిగా మేలు జరిగినట్లు తెలుస్తుంది. ఆయన చేసిన పనులను పరిశీలించి నట్లయితే చాలా వరకు అప్పుడే పనులు జరిగినట్లు మనకు కనిపిస్తుంది ఉదాహరణగా తీసుకున్నట్లయితే ఆయన హయాంలో ఆయా శాఖలకు పలు రకాల పరికరాలు, తీసుకువచ్చారు. ప్రస్తుతం కరోన బారిన పడి రోగులను రక్షించిన ఆక్సిజన్ ప్లాంట్ అదే సమయంలో వచ్చింది. ఎస్ ఎం సి యు అప్గ్రేడ్, ఐ సి యు డిజిటల్ ,చిల్డ్రన్స్ ఐ సి యు , స్టూడెంట్ కంప్యూటర్ లైబ్రరీ ,ల్యాబ్ లాంటి ఆయన ఆయన చేశారు .అంతేకాకుండా గ్రహణ మొర్రి ,క్యాన్సర్ ,వికలాంగుల సదరం క్యాంప్ ,ఈ ఎన్ టి క్యాంపు లాంటివి కూడా ఆయన అయంలోనే జరిగాయి. ఇదిలా ఉంటే డెంటల్ చెర్ , ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వరకు ఉన్నాయి. ఈ మూడు సంవత్సరాల తో పోలిస్తే డాక్టర్ అశోక్ సూపరిండెంట్ డైరెక్టర్గా ఉన్న సమయంలోనే అభివృద్ధి జరిగినట్టు కనిపిస్తుంది . అశోక్ తర్వాత వచ్చిన డైరెక్టర్లు అభివృద్ధి చేసినప్పటికీ నామమాత్రంగానే కనిపిస్తుంది. రిమ్స్ ఆస్పత్రిలో సెకండ్ ఫ్లోర్ లో 20 బెడ్స్  ఐ సి యు, డయాలిసిస్ సెంటర్, ఆ సమయంలో నర్సింగ్ కళాశాల కు ప్రభుత్వం నుంచి బడ్జెట్ రాకపోవడంతో ఆసుపత్రి కళాశాల బడ్జెట్ అడ్జస్ట్మెంట్ చేసి కళాశాలను నడిపించారు.ఏమైనప్పటికీ రిమ్స్  ఆసుపత్రికి సూపరిండెంట్ తప్పకుండా ఉండాలి అలాగే డైరెక్టర్ స్థానంలో డైరెక్టర్ ఉండాలి. పోస్టు ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది.రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కూడా తొందరలో ప్రారంభం కానుంది. అందుకు రిమ్స్ ఆసుపత్రికి తప్పనిసరిగా సూపరిండెంట్ గా  మరొకరి నియమించినట్లు అయితే పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు వైద్య సేవలు మరింత మెరుగయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి గిరిజన వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు మరిన్ని వైద్య సేవలు మెరుగు కావాలంటే ఆస్పత్రికి ప్రత్యేకంగా సూపరిండెంట్ ని నియమించాలని  ప్రజలు కోరుతున్నారు.

కొత్త సూపరిండెంట్ ఎవరు..

రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సు ఆసుపత్రికి కొత్త సూపరిండెంట్ ఎవరు.. అన్న విషయం చర్చనీయంగా మారింది. ఇటీవల రిమ్స్ డైరెక్టర్ మరియు ఆసుపత్రి సూపరిండెంట్ గా ఉన్న డాక్టర్ భానోత్ బలరాంను తొలగించడంతో రిమ్స్ డైరెక్టర్ ఆయన స్థానంలో డాక్టర్ కరుణాకర్ ను నియమించారు. ఆసుపత్రి కూడా సూపరిండెంట్ గా మరొకరిని  నియమించాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. సినియరిటి పరంగా చూసినట్లయితే నలుగురు ప్రభుత్వ  వైద్యులు ఉన్నారు. మొదటి స్థానంలో డాక్టర్ అశోక్ , ఉన్నారు. మూడు సంవత్సరాల పాటు రిమ్స్ డైరెక్టర్ గా నాలుగు సంవత్సరాల పాటు ఆసుపత్రి సూపర్డెంట్ గా చేసిన అనుభవం ఆయనకు ఉంది. రెండోస్థానంలో డాక్టర్ సత్యనారాయణ ఉన్నాడు కొంతకాలం రిమ్స్ ఆస్పత్రిలో సూపరిండెంట్ గా చేసిన అనుభవం ఉంది. డాక్టర్ తిప్ప స్వామి, ,డాక్టర్ ఇద్రిస్ అక్బని  కూడా ఉన్నారు. మొదటి స్థానంలో ఉన్న డాక్టర్ అశోకు సూపర్డెంట్ గా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాట్లు విశ్వసనీయ సమాచారం.