పెండింగ్ వేతనాలు చెల్లించండి

 కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page ..arogyajyothi news (Youtub)

ఆర్గనైజింగ్ సెక్రటరీ  జయప్రకాష్

గద్వాల్,(ఆరోగ్యజ్యోతి): తెలంగాణా రాష్ట్రం లోని వైద్య ఆరోగ్య శాఖ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని తెలంగాణా రాష్ట్ర పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయ్ స్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ జయప్రకాష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నాలుగు నెలలుగా జీతాలు అందక పారా మెడికల్ సిబ్బంది అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. చాలీ చాలని వేతనాలతో విదులు నిర్వహిస్తున్న  తమకు  ప్రతీ నెల జీత భత్యాలు లేక ఆర్థిక భారం తో పాటుగా మానసికంగా కృంగి కృశించి పోవుచున్నారు అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. అప్పులు తీసుకుని విధులు నిర్వర్తించు చున్నారని ఆయన మాట్లాడుతూ చెప్పారు. ప్రతీ నెల 5వ తేదీ లోపల రెగ్యులర్ ఉద్యోగులలో పాటుగా కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసిన కింది స్థాయి అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. సాలరీ బిల్ చేశాం, ట్రెజరీ లో ఇచ్చాం, ఈ కుబెర్ లో ఆగిపోయింది అని పొంతన లేని సమాధానాలు చెప్పడం ఎంత వరకు సమంజసం అని ఆయన ప్రశ్నిచారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి జీతాల బిల్స్ ఎక్కడ ఆగిపోయాయి తెలుసుకొని ఉద్యోగుల వేతనాలు విడుదల చేయాలని ఆయన వారికీ విజ్ఞప్తి చేశారు.