వరదలు వచ్చిన... వైద్య సిబ్బందికి విధులు తప్పవు..

   కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page ..arogyajyothi news (Youtub)

వాగు దదాటి  ఇమ్యునైజేషన్

ఆదిలాబాద్ ,తలమడుగు (ఆరోగ్య జ్యోతి): వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కష్టాలు ఇంతా అంతా కావు... చెప్పుకుంటూపోతే చరిత్ర సరిపోదు... వాగులు వరదలొచ్చినా ఎండలు భగభగ మండుతున్న చలిలో వణుకుతున్న విధులు మాత్రం తప్పరు... అందుకే వారు వేసుకున్న తెల్ల డ్రెస్సు శాంతి చిరునామా గా చెపుతారు.... వారి మౌనమే ఎదుటివారికి సమాధానం... వారు పడే పడే బాధలు ఇన్నీ అన్నీ కావు..... ప్రతి శనివారం బుధవారం రోజున వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆరోగ్య కార్యకర్తలకు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలకు పిల్లలకు ప్రత్యేకంగా టీకాలు ఇస్తారు. డి పి టీ,  ,పోలియో, బీసీజీ ,పెంట,టి టి, డి టి, మిర్చి లాంటి వ్యాక్సిన్స్ ఇవ్వాలి. ఈ వ్యాక్సిన్ క్రమం తప్పకుండా తీసుకోవాలి, ఆరోగ్య కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, వాగులు వరదలు రోడ్డు సౌకర్యం లేకుండా అడవుల్లో నడుచుకుంటూ వెళ్లి బుధవారం శనివారం తప్పకుండా వెళ్లి సంబంధిత వారికి వ్యాధి నిరోధక టీకాలు ఇస్తారు. ఇందులో భాగంగా గా తలమడుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఉంబ్రిసబ్ సెంటర్ లో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలు ఆడేల్లమ్మ, లక్ష్మీ లు ప్రవహించే వాగు దాటుతూ ఇమ్యునైజేషన్ కార్యక్రమానికి వెళ్లారు. వీరు పనితీరును మనందరం అభినందించి హ్యాండ్స్ అప్ చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రమాదం అనికూడా తెలిసి విదులే  మ్యుకుం అని తమ విధులు బాధ్యతలు మరువకుండా ప్రవహించే వాగు దాటుతూ ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమయంలో ప్రమాదాలు సంభవిస్తాయి అని తెలిసి కూడా ధైర్యసాహసాలతో ఆ మహిళా ఆరోగ్య కార్యకర్తలు వాగు దాటుతూ వెళ్లారు.