కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page ..arogyajyothi news (Youtub)
భీంపూర్,(ఆరోగ్యజ్యోతి): భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ షేక్ మొహమ్మద్ రఫీ ఆదిలాబాద్ తలసేమియా సొసైటీ కోశాధికారి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ విజయసారథి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రక్తదానం చేయడానికి ముందుకు రావాలన్నారు. 15 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల వారు ఎవరైనా రక్తదానం చేయవచ్చని పేర్కొన్నారు. దానం చేయడం వల్ల ఎలాంటి బలహీనత రాదని ఈ అపోహలు తొలగించుకుని ప్రతి ఒక్కరు ముందుకు రావాలని సూచించారు. ఉదయం 11 గంటల నుండి రెండు గంటల వరకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.
ములుగు, (ఆరోగ్యజ్యోతి): వైద్య ఆరోగ్య శాఖ లోని నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు
11 వ పి ఆర్ సి ప్రకారం
వేతనాలు పెంచి, రెగ్యులరైజ్
చేయాలని తెలంగాణ మెడికల్ & హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్
సీఐటీయూ పిలుపు మేరకు ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
ఈ కార్యక్రమం లో తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర
కార్యదర్శి జే,సుధాకర్ సి ఐ టి యు ములుగు జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్
మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 11 వ
పీఆర్సీ లో జి ఓ నెంబర్ 60 ద్వారా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల
వేతనాలు పెంచింది. కానీ ఎన్ హెచ్ ఎం పరిధిలో పనిచేస్తున్న 2 వ ఏ ఎన్ ఎం లతో పాటు
గా ఇతర ఉద్యోగుల వేతనాలు మాత్రం పెంచలేదు. ఇది అన్యాయం. వీరంతా గత 22 సంవత్సరాలుగా
చాలీచాలని జీతాలతో ఉద్యోగ భద్రత లేకుండా కరోన విపత్కర పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో
వైద్య సేవలు అందిస్తున్నారు.ఇప్పటికయినా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి
వేతనాలు పెంచి, రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అన్నారు. ఈ
కార్యక్రమంలోరెండవ ఏ ఎన్ ఎం నాయకులు
జమునరాణి, పి.సరోజన, శకుంతల,
సునీత,
సుజాత
,సీత, భాగ్య ,
తిరుమల,కల్పన,
సూర్యకుమారి,
వీరలక్మి,
సుగునవతి,
లలిత,
వెంకటనర్సమ్మ,
ఆదిలక్ష్మి,
పుష్ప,
కన్యాకుమారి
తదితరులు పాల్గొన్నారు.