కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page ..arogyajyothi news (Youtub)
ములుగు,(ఆరోగ్యజ్యోతి): ములుగు ఏరియా హాస్పిటల్ కు ముగ్గురు
కొత్త స్టాఫ్ నర్సులు వచ్చినట్లు ఆసుపత్రి సూపర్డెంట్ జగదీష్ తెలిపారు. కొత్తగా
వచ్చిన స్టాఫ్ నర్సులు రాదా, విజయలక్ష్మి, పద్మావతి లను సుపర్వైసర్ తో పాటు సిబ్బంది సన్మానించారు. ములుగు ఏరియా
హాస్పిటల్ లో స్టాఫ్ నర్స్ కొరత ఉందని ముగ్గురు స్టాఫ్ నర్సులు జాయిన్ కావడం వల్ల
కొంతవరకు కొరత తీరదని ఈ సందర్భంగా సూపర్డెంట్ తెలియజేశారు. విధుల్లో చురుగ్గా
పాల్గొని రోగులకు సేవలు అందించాలని ఈ సందర్భంగా ఆయన కొత్త స్టాఫ్ నర్సులు
సూచించారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ సూపర్డెంట్ లు మేరీ , సరోజ
తో పాటు ఝాన్సీ ప్రేమలత సిబ్బంది శ్రీకర్, మహేష్, లత ,ఆదిలక్ష్మి , కోవిడ్ సూపర్వైజర్ నాజర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.