ఒక ఆడ బిడ్డ కు ఆపరేషన్ చేయించుకున్న వనమాల

 కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page

అందరికి ఆదర్శం ఈ వనమాల

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): ఈరోజుల్లో కొడుకు ఉంటేనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటారు . కొడుకు లేకుంటే ఎందరైన  ఆడపిల్లలను కనడానికి  సిద్ధంగా ఉన్న ఈ సమాజంలోకొడప వనమాల అనే గిరిజన మహిళ ఒక ఆడబిడ్డకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలం లో గల నర్సాపూర్ జి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల చిన్నసలియాల  గ్రామంలో దివాకర్ వర్ణమాల అనే దంపతులకు ఆడబిడ్డ జన్మించింది. ఆడబిడ్డ ఒకటే సరిపోతుంది అనే ఉద్దేశంతో 11 డిసెంబర్ 20 20 న నిర్మల ప్రైవేటు ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకొని ఆదర్శంగా నిలిచారు. గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ఒక గిరిజన దంపతులు ఒక కూతురు ఉన్నప్పటికీ వాళ్ళు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం సమాజంలో చదువుకున్న పెద్ద పెద్ద ఉద్యోగాలు, వ్యాపారస్తులు ఉన్నప్పటికీ ఒక బిడ్డ తో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న ఎన్నోసార్లు ఆలోచిస్తారు. కొడప వనమాల దివాకర్ల మాత్రం ఆలోచించకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుని ఆదర్శ దంపతులు గా నిలిచారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా కొడప వనమాల ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్  అభినందిస్తూ అవార్డును అందజేశారు. డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ సాధన, జిల్లా సర్విలేన్స్ అధికారి డాక్టర్ వై సీ శ్రీనివాస్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ విజయ సారథి, అడిషనల్ డిఎంహెచ్ఓ ఎయిడ్స్ లెప్రసీ జిల్లా అధికారి డాక్టర్ శ్రీకాంత్ మెట్పల్లి వార్, జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ శ్రీధర్ మెట్పల్లి వార్, జిల్లా కుటుంబ నియంత్రణ అధికారి డాక్టర్ నవ్యసుధా, ఎన్ సి డి అధికారి డాక్టర్ క్రాంతి కూడా కొడప వనమాల ని  అబిన్దించారు. నరసాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారులు డాక్టర్ రవి కుమార్ రాథోడ్, డాక్టర్ హిమబిందు, సూపర్వైజర్ రవీందర్ రాథోడ్ వర్ణమాల ను అభినందించారు.