కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page
వరంగల్ అర్భన్ (ఆరోగ్యజ్యోతి):
జాతీయ వైద్యుల దినోత్సవం పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్
కె లలితాదేవి ఆధ్వర్యంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సుమారు 60 మంది
వైద్యులకు సత్కారం చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్
లలితాదేవి మాట్లాడుతూ వైద్యులు అంటే కనిపించే దేవుళ్ళని వైద్యులను ప్రజలు
దేవుళ్లతో సమానంగా కొలుస్తారని ఈ సందర్భంగా ఆమె తెలిపారు కరోనా సమయంలో దిగి వచ్చిన
దేవుళ్ళు అందరూ పని చేశారని ఇది చాలా సంతోషకరమైన విషయం అన్నారు. ప్రాణాలకు తెగించి
కరోనా రోగులకు సేవలు అందించిన ఘనత వైద్యులకే దక్కుతుందని ఈ సందర్భంగా వారు
తెలిపారు. 10 మంది వైద్యులకు సన్మానం చేశారు . ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ మదన్మోహన్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ గీతాలక్ష్మి డాక్టర్ శ్రీ కృష్ణ
రావు డాక్టర్ ప్రియాంక. డాక్టర్ అనురాధ , డాక్టర్ మాలిక , డాక్టర్ భరత్
డాక్టర్ శ్రీదేవి , డాక్టర్ రవీందర్.
డాక్టర్ అరుణ్ చంద్ర , డాక్టర్ సుమన్ ,
డాక్టర్ హిమ బిందు
డాక్టర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.