వైద్య ఆరోగ్య శాఖలో డిప్యుటేషన్ రద్దు

  కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page

వెయ్యి మందికి పైగా సొంత పోస్టింగ్ కు వెళ్లాలని ఉత్తర్వులు

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1000 మంది కి డిప్యూటేషన్ రద్దు

హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): కరోనా పరిస్థితులను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రజా ఆరోగ్య శాఖ గత ఏడాది రాష్ట వ్యాప్తంగా ఇచ్చిన డిప్యుటేషన్ రద్దు చేయాలని సర్కారు  ఉత్తర్వులను జారీ చేసింది. వైద్యులు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది ఇతర సహాయక సిబ్బంది డిప్యుటేషన్ రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నాయి. డిప్యుటేషన్ లపై  పనిచేస్తున్న ఉద్యోగులందరూ వెంటనే వారి స్వస్థలాలకు పంపించాలని  తెలంగాణ ప్రజా ఆరోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస రావు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ సమయంలో ఉద్యోగులు వేరే జిల్లాలకు వచ్చారని ముఖ్యంగా హైదరాబాద్   వచ్చి పని చేస్తున్నారని వీరందరినీ వెంటనే డిప్యుటేషన్ రద్దు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సర్క్యులర్ జారీ చేశారు డి హెచ్ డాక్టర్ శ్రీనివాసరావు. డిప్యుటేషన్ పై వెళ్లిన వారందరినీ వెంటనే వెనక్కి పంపించాలని ఆదేశించారు .వారికి ఇచ్చిన వర్క్ ఆర్డర్ లన్నిటిని రద్దు చేయాలని స్పష్టంగా సర్క్లార్లో  వివరించారు.