రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని
పశ్చిమ గోదావరి,(ఆరోగ్యజ్యోతి): వర్కింగ్ జర్నలిస్టులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆరోగ్య సంరక్షణ పథకాన్ని వినియోగించుకోవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. శనివారం నాడు జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం వేగవరం లో విజయ ఐ కేర్ హాస్పిటల్ నందు వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య సంరక్షణ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్యశ్రీ పథకం కింద అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు ఉచితంగా అందిస్తుందని మంత్రి పేర్కొన్నారు.