కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page ..arogyajyothi news (Youtub)
భీంపూర్,(ఆరోగ్యజ్యోతి): భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ షేక్ మొహమ్మద్ రఫీ ఆదిలాబాద్ తలసేమియా సొసైటీ కోశాధికారి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ విజయసారథి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రక్తదానం చేయడానికి ముందుకు రావాలన్నారు. 15 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల వారు ఎవరైనా రక్తదానం చేయవచ్చని పేర్కొన్నారు. దానం చేయడం వల్ల ఎలాంటి బలహీనత రాదని ఈ అపోహలు తొలగించుకుని ప్రతి ఒక్కరు ముందుకు రావాలని సూచించారు. ఉదయం 11 గంటల నుండి రెండు గంటల వరకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.