ఆనందయ్య ను సత్కరించిన కొండపల్లి శ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థాన దామెర్ల సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు.....
కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page
నెల్లూరు ,(ఆరోగ్యజ్యోతి): ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారిని పారదోలేందుకు ఆయన నడుంబిగించారు... 30 సంవత్సరాలుగా నెల్లూరు కృష్ణపట్నం పరిసర ప్రాంతాల్లో అనేక దీర్ఘ కాలిక వ్యాధులకు ఆయుర్వేద మందులు పంపిణీ చేస్తున్నారు.. ఈ క్రమంలో కరోనా మహమ్మారి రావడంతో ఆయన తయారు చేసిన మందును గ్రామస్తులకు ఇవ్వటంతో మంచి ఫలితం వచ్చింది. దీంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన రావడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు న్యాయస్థానాలు సైతం ఆనందయ్య మందు పై సమీక్ష నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరకు వైద్య విభాగాలు సంబంధించిన ఐసీఎంఆర్ బృందం కూడా ఆనందయ్య మందు హానికరం కాదని ఉపయోగించవచ్చని నివేదికను అందజేశాయి. చివరకు న్యాయస్థానాలు కూడా ఆనందయ్య మందు కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఆనందయ్యను ఒకసారి కలిసి ఆయనను సత్కరించాలని కొండపల్లి శ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థానం దామెర్ల సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తలచారు. ఆయన సమ్మతించడం తో ఘనంగా సత్కరించి భవిష్యత్తులో అందరికీ ఆయన మందు అందేవిధంగా కృషి చేయాలని కోరారు. కొండపల్లి గ్రామంలో కూడా పంపిణీ చేసి ఈ ఆయుర్వేద మందు పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. కొద్దిరోజుల్లో ఆయన కొండపల్లి గ్రామానికి చేరుకొని శ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థానం సందర్శించి ఆశీస్సులు తీసుకోనున్నట్లు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.