కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page
హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస రావు ని తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ H1, రాష్ట్ర అధ్యక్షుడు కర్నాటి సాయి రెడ్డి ఆధ్వర్యంలో కలవడం జరిగింది. అనంతరం అలాగే హెచ్ వన్ యూనియన్ తరపున డైరెక్టర్ శ్రీనివాసరావు గారిని ఘనంగా సన్మానించడం జరిగింది. వివిధ సమస్యలపై మెమోరాండం ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ మహానగరంలో గత 24 సంవత్సరాలుగా ఎహ్ ఆర్ డి ఏఎన్ఎం స్కీం లో పనిచేస్తున్న ఏఎన్ఎంల కు తీరని అన్యాయం జరుగుతుందని, వారికి 15 వేల రూపాయల వేతనం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కావున వీరికి మిగతా ఏఎన్ఎం తో సమానంగా వేతనం ఇవ్వాలని కోరడం జరిగింది. దీనికి డైరెక్టర్ గారు సానుకూలంగా స్పందించడం జరిగింది మరియు వివిధ కేటగిరీల ప్రమోషన్ల గురించి చర్చించడం జరిగింది పై విషయాలన్నీ టి పట్ల సానుకూలంగా స్పందించడంతో పాటు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో H1 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్, కర్ణం సత్యనారాయణ, మచ్చగిరి, రేణు కుమార్, రవీందర్, ఎహ్ ఆర్ డి నాయకురాళ్లు సంతోష కుమారి, అనిత, సలోమి, నాగమణి, రేణుక, పద్మ జయ వీణ మరియు మెర్సి డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.