కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page ..arogyajyothi news (Youtub)
- కింగ్
కోటి హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్.రాజేంద్రనాథ్
హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి):
కోవిడ్ నేపథ్యంలో అహర్నిషలు అద్బుతమైన సేవలందించి, ప్రజల ప్రాణాలు కాపాడటంలో విశిష్టమైన
కృషి చేసిన కింగ్ కోటి హాస్పిటల్ వైద్యులు , వైద్య సిబ్బంది మరువలేనివని కింగ్
కోటి హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్.రాజేంద్రనాథ్ అన్నారు. ఐక్య వేదిక ప్రతినిధుల
అద్వర్యంలో విడ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్.మల్లికార్జున్, నర్సింగ్ సూపరిండెంట్ ఎస్తేర్ వెరొనికా, సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్
యం.ఎస్.మూర్తి ల కు కోవిడ్ కష్టకాలంలో అవిశ్రాంతంగా అందించిన సేవలకు గాను
పూలగుచ్చాలు, శాలువాలతో
సత్కరించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్
రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ కరోనా సమయంలో కంటికి నిద్ర లేకుండా మెడికల్
పారామెడికల్ సిబ్బంది రోగులకు ఎంతగానో సేవలు అందించారన్నారు. వైద్యులే కాకుండా
వైద్య సిబ్బంది కూడా సేవలు అందించడంలో ముందున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు
కరోనా వచ్చిన రోగులకు ఇంటి వారి దూరం కొట్టారని అలాంటి సమయంలో వైద్యులు వైద్య
సిబ్బంది ప్రాణాలకు తెగించి సేవ చేసి ఘనత వీరిదే నన్నారు ఈ కార్యక్రమంలో ఐక్య
వేదిక ప్రతినిధులు డాక్టర్ రవి శంకర్ ప్రజాపతి, డాక్టర్.షరీఫ్, డాక్టర్.జనార్ధన్, సుజాతరాథోడ్, శిరీషరాణి, మంచాల రవీందర్, వీరారెడ్డి మెడికల్ పారామెడికల్
సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.