ఎన్జీవోలకు సహాయ సహకారాలు అందిస్తారు

కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page  

హైదరాబాద్,(హైదరాబాద్): స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తానని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె కేశవరావు, జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ లక్ష్మి అన్నారు.గురువారం రోజు స్వచ్ఛంద సంస్థల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు. తెలంగాణ రాష్ట్ర స్వచ్ఛంద సంస్థల యాక్షన్ కమిటీ అధ్యక్షులు మీదగా గోపి బోయ చైర్మన్ సత్యనారాయణ వైస్ ప్రెసిడెంట్ పన్యాల మమత గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ దామా రజిని రుద్రమ తదితరులు కలిశారు. రాష్ట్రంలో స్వచ్ఛంద సంస్థలు JAC గా ఏర్పాటు కావడం అభినందనీయమన్నారు. స్వచ్ఛంద సంస్థలు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సేవలను అందించటం ఎంతో అభినందనియమన్నారు. స్వచ్ఛంద సంస్థల సమస్యల  పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తానన్నారు.