కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page ..arogyajyothi news (Youtub)
కామారెడ్డి,(ఆరోగ్యజ్యోతి): ఆసుపత్రుల్లో
స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లయితే చర్యలు తప్పవని జిల్లా
వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. కామారెడ్డి లోని
శ్రీ రామ్ నగర్ కాలనీ లో గల కౌసల్య మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో గర్భస్థ పిండం
నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు రాష్ట్ర స్థాయి నోడల్
అధికారి సీనియర్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ సూర్య శ్రీ రావు, జిల్లా
ప్రోగ్రాం అధికారి డాక్టర్ శిరీష కలసి ఇ డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్లో
హాస్పిటల్ లో గర్భిణీకి నిర్ధారణ స్కానింగ్ పరీక్ష చేసి కడుపులో ఉన్నది ఆడ మగ అని
చెప్తున్న విషయం నిజమేనని కుందన్ నిర్ధారించింది. ఈ ఆస్పత్రిలో తర్వాత లేనివారు
స్కానింగ్ చేయడం గర్భవిచ్ఛిత్తి అబార్షన్ చేయడం అం తో పాటు ఆస్పత్రికి కూడా
రిజిస్ట్రేషన్ లేదని తేలింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆసుపత్రిని కామారెడ్డి
తాసిల్దార్ సిబ్బందితో కలిసి సీజ్ చేయడం జరిగింది. ఆసుపత్రికి యాజమాన్యం పైన PC&
PNDT ( గర్భస్థ పిండ
లింగ నిర్ధారణ పరీక్ష ) చట్టం ప్రకారం కేసు పెట్టుటకు స్థానిక పోలీస్
స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది.