రిమ్స్ కి ఆక్సైన్ ఆయిడ్ డొనేట్

 కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 70 13 26 01 76 )

www .arogyajyothi.com,  arogyajyothi.page

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రికి యాక్సైడ్ స్వచ్ఛంద సంస్థ మర్సుకోల తిరుపతి అద్వర్యంలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ డొనేట్ చేసినారు.ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నజిల్లా పరిషత్ చైర్మన్ జనార్దన్ రాథోడ్ , బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ తుల శ్రీనివాస్జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ రిమ్స్ డైరెక్టర్ కరుణాకర్ ,అద్ది బొజ రెడ్డి, మర్సుకోల తిరుపతి, జాదవ్  కృష్ణ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న జిల్లా పరిషత్ చైర్మన్ జనార్దన్ రాథోడ్ మాట్లాడుతూ మార్కుల తిరుపతి ఆధ్వర్యంలో రిమ్స్ కు పది, జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు పది ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ లను యాక్సైడ్ స్వచ్ఛంద సంస్థ ఇప్పటి వరకు 20 ఆక్సైన్ ఆయిడ్ మిషన్లను పంపిణీ చేశారన్నారు. ఆక్సైన్ ఆయిడ్ మెషిన్ విలువ లక్ష రూపాయలు ఉంటుందని తెలిపారు. కరోనా తర్డ్ వే ప్రజలపై, పిల్లలపై ఇప్పటి వరకు ప్రభావం చూపలేదని, తగు జాగ్రత్త చర్యలను రిమ్స్ చేపట్టామని సూచించారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూనే ఉందన్నారు. రోగుల కొరకు ఇది ఒక వరప్రసాద్ అని వారు పేర్కొన్నారు. గిరిజన జిల్లాను దృష్టిలో ఉంచుకొని దాతలు ముందుకు రావాలని వారు కోరినారు.