నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులకు పిఆర్సి వెంటనే వర్తింపచేయాలి

   కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page ..arogyajyothi news (Youtub)

మహబూబాబాద్,(ఆరోగ్యజ్యోతి): నేషనల్ హెల్త్ మిషన్ కింద పనిచేస్తున్న ఉద్యోగులకు తెలంగాణ పి ఆర్ సి లో వేతనాలు పెరగలేదని వెంటనే వేతనాలు పెచాలని  తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం నాడు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 22 సంవత్సరాలుగా వివిధ శాఖల్లో వివిధ హోదాల్లో పని చేస్తూ చాలీచాలని జీతాలతో ఉన్నారన్నారు కనీస ఉద్యోగ భద్రత లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారునేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ ఎహ్ ఎం) ఉద్యోగులకు 2016లో పెంచాల్సిన వేతనాలను 2018లో 500 జీవో జీవో ప్రకారం నామమాత్రంగా పెంచారు రాష్ట్రంలో దాదాపు 12 వేల మందికి పైగా వివిధ కేటగిరీల్లో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ ఎహ్ ఎం) లో విధులు నిర్వహిస్తున్నారు. 51జీవో ప్రకారం కొంతమంది. నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ ఎహ్ ఎం) ఉద్యోగులకు వేతనం పెంచినారు. ఇదే  51జీవో ప్రకారం నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ ఎహ్ ఎం) ఉద్యోగులకు వేతనం మూడు నుంచి నాలుగు వేల మందికి ఉద్దోగులకు ఇంక  2018 లో పెంచవలసిన  వేతనాలు ఇంక పెంచలేదని వారు ఆవేదన వ్యక్తం చేసినారు. పి ఆర్ సి లో మాత్రం వారికి నిరాశే మిగిలిందనారు. . గత సంవత్సరం నుంచి కరోనా మహమ్మారి తో పోరాటం చేస్తూ ప్రాణాలకు తెగించి పేదలకు సేవలందిస్తూ ఈ సందర్భంగా వారు తెలిపారు.