రిమ్స్ కార్మికులపై వేధిస్తున్న సొసైటీపై చర్యలు తీసుకోండి

  కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page ..arogyajyothi news (Youtub)

రిమ్స్ లో తొలగించిన స్టాఫ్ నర్స్  లను విధుల్లోకి తీసుకోండి

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): రిమ్స్ లో పనిచేస్తున్న పారిశుద్ధ్య, సెక్యూరిటీ ,పేషెంట్ కేర్ ,దాయ లపై కాంట్రాక్టర్ సూపర్వైజర్, డిప్యూటీ మెడికల్ సూపర్డెంట్, వేధిస్తున్నారని వీరిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్( సిఐటియు) జిల్లా జనరల్ సెక్రెటరీ ఎస్ నవీన్ కుమార్, సహాయ కార్యదర్శి బొజ్జ, గౌరవ అధ్యక్షులు కే కిరణ్ ,రిమ్స్ అధ్యక్షులు అక్రం ఖాన్ లు  మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిమ్స్లో తొలగించిన స్టాఫ్ నర్స్  లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వారు కోరారు .కార్మికులపై వేధింపులు అరికట్టాలని, వేధిస్తున్న డిప్యూటీ మెడికల్ సూపర్డెంట్ మరియు హెల్త్ సూపర్వైజర్, స్పార్క్ సూపర్వైజర్ లపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. పనిచేస్తున్న మహిళా కార్మికుల ఫోటోలను తీయడం వెంటనే మానేయాలని వారు డిమాండ్ చేశారు .పర్మినెంట్ పేరుతో కార్మికులను ఇబ్బందులకు గురి చేయడం ఆపి తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వారు కోరారు. రోస్టర్ ప్రకారం కార్మికులందరికీ డ్యూటీ లు  వేయాలని సూచించారు. ప్రతి నెల 5వ తేదీ లోపు కార్మికులందరికీ వేతనాలు ఇవ్వాలన్నారు. కార్మికులందరికీ ఈపీఎఫ్ ఈఎస్ఐ సక్రమంగా చెల్లించాలని చెల్లించిన యెడల సొసైటీని  బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ మెడికల్ సూపర్డెంట్ పోస్టును వెంటనే తొలగించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.