రిమ్స్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కరుణాకర్

కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 70 13 26 01 76 )

www .arogyajyothi.com,  arogyajyothi.page

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రిమ్స్ డైరెక్టర్ గా డాక్టర్ కరుణాకర్ బాధ్యతలను స్వీకరించారు. రిమ్స్ డైరెక్టర్ గా ఉన్న డాక్టర్ బలరాం నాయక్ నుండి బుధవారం నాడు డాక్టర్ కరుణాకర్ రిమ్స్ డైరెక్టర్ తో పాటు ఆసుపత్రి సూపర్-ఇండెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కరుణాకర్ మాట్లాడుతూ సమస్యలు తలెత్తకుండా రోగులకు అన్ని రకాల సేవలు అందించడంలో తనవంతు కృషి చేస్తానని తెలిపారు.