ప్రభుత్వ వైద్యుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

 

-      -      జిల్లా అధ్యక్షులు డాక్టర్  శ్రీదర్ మెట్పల్లి

దిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ ఆద్వర్యం లో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికార్యాలయం ముందు నిరసన కార్య క్రమాలు చేపట్టినారు. సందర్భంగా జిల్లా అధ్యక్షులు డాక్టర్  శ్రీదర్ మెట్పల్లి మాట్లాడుతూ 1జులై 2018 తరువాత నియామకమైన ప్రభుత్వ వైద్యులకు డైరెక్టర్ అఫ్ పబ్లిక్ 01/2017 నోటిఫికేషన్ తరువాత కూడా కాంటాక్ట్ పద్దతిలో కొనసాగుతూ వివిధ  కోర్ట్ కేసుల కారణంగా  1 జులై 2018 తరువాత  శాశ్వత నియామక ఉత్తర్వులు తీసుకోవల్సి వచ్చినదని , వైద్య విధాన పరిషద్ ఈఎస్ఐ తో పాటు వివిధ విభాగాల్లో కాంట్రాక్టు పద్ధతి చేయుచున్న వైద్యులకు కూడా 2020 పిఆర్సి  నందు 30% ఫిట్మెంట్ వర్తింప చేయాలని  అన్నారు. లేని యెడల వీరు ఆర్థికముగా భారీగా నష్టపోతారని అయన తెలిపినారు. సుప్రీమ్ కోర్ట్ ఆర్డర్ ప్రకారం పీజీ కోర్స్ లో ప్రభుత్వ  వైద్యులకు 50% ఇన్ సర్వీస్ కోటా పునరుద్దరించలని కోరినారు.రెగ్యులర్ వైద్యుల భర్తీ కొరకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్దతిలో కాంట్రాక్టు వారికి వెయిటెజ్ ఇస్తూ నోటిఫికేషన్  విడుదల చేయగలరు. 2018 లో నియామకం అయిన డాక్టర్లకు కౌన్సిలింగ్ జరగకపోవటం చేత భార్య ఒక దగ్గర భర్త ఒక దగ్గర పిల్లతో ఇబ్బంది పడుతూ ,ఇతర అనారోగ్య కారణాల చేత కొంత మంది ఇబ్బంది పడుతున్నారు . కావున త్వరగా వారి కొరకు ప్రత్యేక ట్రాన్స్ఫర్ లను చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరినారు. గతం లో ఇచ్చిన డెప్యూటేషన్ లను యథా విధిగా కొనసాగించాలని కోరినారు. 2018  లో నియామక మైన వైద్యులు  కంటి వెలుగు నుంచి కరోనా వరకు కఠోర శ్రమ చేస్తూ ప్రభుత్వ ఆరోగ్య పథకాలను వియజయవంతంగా  ముందుండి నడిపించటం లో  కీలక పాత్ర పోషించాని అయన ఈ సందర్భముగా తెలిపినారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి డాక్టర్  క్రాంతి కుమార్, ఉపాధ్యక్షుడు డాక్టర్  రాహుల్,  జాయింట్ సెక్రటరీ, డాక్టర్ జాయింట్ సెక్రటరీ శ్రీకాంత్ మిట్పెల్లివర్, డాక్టర్ బి. విజయ్ కుమార్, డాక్టర్ నవ్య సువిధ డాక్టర్ రోజా రాణి, డాక్టర్  నిర్మల డాక్టర్ సురేష్, డాక్టర్ శ్రీకాంత్ దేకావత్, డాక్టర్ వినోద్ డాక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.