కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page
హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి):వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల వేతనాలు పెంచుతూ రెగ్యులర్ చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు భూపాల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యాద నాయకులు అన్నారు. సోమవారం నాడు తెలంగాణ యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం భాగ్లింగంపల్లి హైదరాబాద్ నందు ఆరోగ్య శాఖలో నేషనల్ హెల్త్ మిషన్ కాంట్రాక్టు ఉద్యోగుల రాష్ట్ర సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు సేవలు అందించే నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సి ప్రకటించకపోవడం అన్యాయం అన్నారు. ప్రధానంగా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో పని చేస్తున్న ఉద్యోగులు అత్యధికంగా నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు లేని వారు తెలిపారు .వైద్యులు ఇతర ఉద్యోగులు అందరూ రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నారని విపరీతమైన పని ఉందని పనికి తగిన వేతనాన్ని చెల్లించాలని వారు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా వైద్య ఉద్యోగుల పై పని భారం తగ్గించాలని సంవత్సరకాలం సెలవులు ఆదివారాలు లేకుండా పని చేస్తున్నా స్పెషల్ ఇన్స్టెంట్ ఇవ్వాలని వారు కోరారు .విధినిర్వహణలో చనిపోయిన వారందరికీ కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వడంతోపాటు వారి కుటుంబంలో తర్వాత ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి ఎం డి పసియోద్దిన్,రాష్ట్ర ఆఫీస్ బేరర్లు ఏ కవిత, కె బలరాం, విజయవర్ధన్ రాజు, బైరిపాక శ్రీనివాస్, కె విజయ, లక్ష్మి ,నర్మదా ,శ్రీనివాసాచారి ,మోహన్ నాయక్, సావిత్రి ,కిరణ్ ,కుమార్ తదితరులు పాల్గొన్నారు