హెల్త్ సూపర్వైజర్ ల సమస్యలను పరిష్కరించండి

కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page 

డి యమ ఎహ్ ఓ  కు వినతి పత్రం

 ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న హెల్త్ సూపర్వైజర్లు సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నరేందర్ కు వినతి పత్రం సమర్పించారు. గత కొంత కాలంగా హెల్త్ సూపర్వైజర్లు  చాలా ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. సబ్ సెంటర్లు అనుబంధ గ్రామాలు గిరిజన గ్రామాలకు రోడ్లు లేక తమ బైక్ల పై వెళ్ళిగా  బైక్ లు అన్నీ చెడి పోయారని వెంటనే స్పందించి ఏ ఎన్ ఎం లకు మాదిరిగానే    సూపర్వైజర్ కూడా వాహనాలు ఇవ్వాలని వారు ఈ సందర్భంగా కోరారు. కరోన  సమయంలో జిల్లాలో పనిచేస్తున్న సూపర్వైజర్ అందరు కంటికి నిద్ర లేకుండా పని చేశాను తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోని పరిధిలోగల సబ్ సెంటర్లు అనుబంధ గ్రామాల్లో తిరగటానికి చాలా ఖర్చు అవుతుందని పెట్రోల్ బిల్లు కు ఎఫ్ టి ఏ బిల్లు ఇప్పించాలని పేర్కొన్నారు ప్రతి విషయానికి ప్రతి నెలా దాదాపు రెండు వేల రూపాయల వరకు జిరాక్స్ కొరకు డబ్బులు ఖర్చు అవుతున్నాయని ఆస్పత్రి నిధుల నుంచి  జిరాక్స్ ఖర్చుల కొరకు ఏర్పాటు చేయాలని వారు సూచించారు. రెండు సంవత్సరాల నుంచి కరోన పై  పనిచేస్తున్న తమకు చాలా ఇబ్బందులకు గురవుతున్నామని ఒక్క సెలవు కూడా పెట్టలేని పరిస్థితి నెలకొందని ప్రతి సూపర్వైజర్ కు సెలవులు ఇప్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు సురేష్, వేణుగోపాల్, సుభాష్ ,సంతోష్, తులసి రామ్ ఈశ్వర్ ప్రేమ్ సింగ్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.