కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page ..arogyajyothi news (Youtub)
నిర్మల్(ఆరోగ్యజ్యోతి): వైద్య ఆరోగ్య శాఖ లోని నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు11 వ పి ఆర్ సి ప్రకారం వేతనాలు పెంచి, రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ మెడికల్ & హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ పిలుపు మేరకు నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో సి ఐ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెనసురేశ్,తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సుజాత,జిల్లా కార్యదర్శి రమణ, సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షుడు G.కిషన్ మాట్లాడుతూ . నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ ఎహ్ ఎం) ఉద్యోగులకు 2016లో పెంచాల్సిన వేతనాలను 2018లో 510 జీవో జీవో ప్రకారం నామమాత్రంగా పెంచారు రాష్ట్రంలో దాదాపు 12 వేల మందికి పైగా వివిధ కేటగిరీల్లో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ ఎహ్ ఎం) లో విధులు నిర్వహిస్తున్నారు. 510 జీవో ప్రకారం కొంతమంది. నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ ఎహ్ ఎం) ఉద్యోగులకు వేతనం పెంచినారు. ఇదే 510 జీవో ప్రకారం నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ ఎహ్ ఎం) ఉద్యోగులకు వేతనం మూడు నుంచి నాలుగు వేల మందికి ఉద్దోగులకు ఇంక 2018 లో పెంచవలసిన వేతనాలు ఇంక పెంచలేదని వారు ఆవేదన వ్యక్తం చేసినారు. పి ఆర్ సి లో మాత్రం వారికి నిరాశే మిగిలిందనారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 11 వ పీఆర్సీ లో జి ఓ నెంబర్ 60 ద్వారా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచింది. కానీ ఎన్ హెచ్ ఎం పరిధిలో పనిచేస్తున్న 2 వ ఏ ఎన్ ఎం లతో పాటు గా ఇతర ఉద్యోగుల వేతనాలు మాత్రం పెంచలేదు. ఇది అన్యాయం. వీరంతా గత 22 సంవత్సరాలుగా చాలీచాలని జీతాలతో ఉద్యోగ భద్రత లేకుండా కరోన విపత్కర పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్నారు.ఇప్పటికయినా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వేతనాలు పెంచి, రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎహ్ఎం ఉద్యోగులు శ్రీనివాస్,రవికిరణ్,రాములు,భారత్,ఆయుష్ విభాగం నుండి డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ సంధ్య,సూచరిత, జైపాల్,గౌతమి, ఆరోగ్యక కార్యకర్తలు బొజ్జ సౌజన్య, శ్రీకన్య, సుజాత, పద్మ, రాధ,లక్ష్మీ, సుమిత్ర,భూదేవి,జయమేరి,నాగమ్మ, శెంకరమ్మ,స్రవంతి రాజకళ ప్రేమలత, నవీన్, గంగాధర్ సాదిక్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.